Chiranjeevi-Prudhvi Raj: మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి అవకాశం వచ్చిందంటే దాదాపు ఎవ్వరూ వదులుకోరు. కానీ, ఓ హీరో మాత్రం చిరు రెండు సార్లు అడిగినా కాదన్నాడట. అయితే ఆ హీరో మన తెలుగు హీరో కాదులేండీ.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఓవైపు స్టార్ హీరోగా, మరోవైపు దర్శకనిర్మాతగా దూసుకుపోతున్నాడీయన.
అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ తాను మలయాళంలో నటించిన సూపర్ హిట్ మూవీ `కడువా`ను తెలుగులో అదే పేరుతో విడుదల చేయబోతున్నాడు. జూన్ 30న యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన `కడువా`ను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను బయటకు వదిలారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్.. సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే చిరంజీవి సినిమాల నుంచి వచ్చిన ఆపర్లపై కూడా స్పందించారు. `చిరంజీవి ‘లూసిఫర్(మలయాళంలో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు)’ రీమేక్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన స్టార్ ఇమేజ్‌కు కరెక్ట్‌గా సరిపడే కథ.
మొదట నన్ను దర్శకత్వం వహించమని చిరు అడిగారు. కానీ ఆ టైమ్ లో నాకు కుదరలేదు. అంతకుముందు `సైరా నరసింహ రెడ్డి`లో ఓ పాత్ర కోసం కూడా సంప్రదించారు. అప్పుడూ చేయలేకపోయా. అయితే, భవిష్యత్తులో ‘లూసిఫర్ 2 తీస్తాను. ఒకవేళ ఆ సినిమాను కూడా చిరంజీవి రీమేక్ హక్కులు తీసుకుని డైరెక్ట్ చేయమని అడిగితే అస్సలు వదులుకోను, తప్పకుండా చేస్తా` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…