Entertainment News సినిమా

`జ‌న‌గ‌ణ‌మ‌న‌`కు బ్రేక్‌.. పూరి జ‌గ‌న్నాథ్ నెక్స్ట్ ఆ హీరోతోనే అట‌..?!

Share

2015లో విడుద‌లైన బ్లాక్ బస్ట‌ర్ మూవీ `టెంప‌ర్‌` త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల్లో మునిగిపోయిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. మ‌ళ్లీ 2019లో వ‌చ్చిన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ మూవీ అనంత‌రం పూరి జ‌గ‌న్నాథ్ చేసిన చిత్ర‌మే `లైగ‌ర్‌`. టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే ఇందులో హీరోయిన్లుగా న‌టించారు.

ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రం ఆగ‌స్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైంది. అయితే తొలి షో నుంచే ఈ మూవీ ఫ్లాప్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో స‌గం వ‌సూళ్ల‌ను కూడా రాబ‌ట్ట‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డింది. ఈ మూవీ అనంత‌రం పూరి జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జ‌న‌గ‌ణ‌మ‌న‌` చేయాల‌ని భావించారు.

 

ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక అయింది. కొద్ది రోజుల క్రిత‌మే ఈ మూవీని ముంబైలో ప్రారంభించారు. కానీ, `లైగ‌ర్‌` వ‌ల్ల భారీ న‌ష్టాలు వాటిల్ల‌డంతో `జ‌న‌గ‌ణ‌మ‌న‌`కు బ్రేక్ ప‌డింది. అయితే మ‌రి పూరి జ‌గ‌న్నాథ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో చేయ‌బోతున్నారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌గా.. ఒక‌టి పేరు తెర‌పైకి వ‌చ్చింది.

ఆ పేరు మ‌రెవ‌రిదో కాదు.. పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి. పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేసి.. అత‌డి కెరీర్‌ను ఓ గాడిలో పెట్టాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. ఇప్ప‌టికే త‌న‌యుడితో సినిమా చేసేందుకు మంచి క‌థ‌ను కూడా సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి.


Share

Related posts

కూతురి గురించి జీవిత ఏమ‌న్నారంటే..!

Siva Prasad

బిగ్ బాస్ 4 : నక్క తోక తొక్కిన సోహెల్..! ఆ ఆఫర్లు ఏంటి బాబోయ్…

arun kanna

Prabhas : ప్రభాస్ సలార్ లో కూడా దీపిక పదుకొణె.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ అదిరింది ..?

GRK