అందాల భామ రాశి ఖన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తనదైన అందం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడగట్టుకుంది. కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా ఉండే రాశి.. ఆ తర్వాత స్లిమ్‌గా మారి తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటోంది.
కానీ, రాశి ఖన్నాకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. వరుస ఆఫర్లు వస్తున్నా.. అమ్మడుకు సరైన హిట్ మాత్రం పడటం లేదు. ఈమె ఎన్నో ఆశలు పెట్టుకున్న పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాలు కూడా ఇటీవల విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
సినిమా విషయం పక్కన పెడితే.. రాశి ఖన్నా సోషల్ మీడియా వేదికగా వేరె లెవల్లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా కూడా ఎల్లో శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి వయ్యారాలు పోతూ ఫొటోలకు పోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ ను చూస్తే చూపు తిప్పుకోవడం కూడా కష్టమే. అంత అందంగా రాశి ఖన్నా కనిపిస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ.. వరుస ఫ్లాపుల్లో మునగడమే ఆమెకు పెద్ద మైనస్. మరి ఈ బ్యూటీ కెరీర్ పరంగా ఎప్పటికి పుంజుకుంటుందో చూడాలి.