Radhaku Neevera Pranam ఎపిసోడ్ 1: ఏదేమైనా వదలను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నా నేనే… అంటూ బ్యాక్గ్రౌండ్ పాట వొస్తుండగా స్టైలిష్ గా నడుస్తూ వొస్తాడు రాధకు నీవెరా ప్రాణం సీరియల్ హీరో కార్తీక్ కృష్ణ. ఏప్రిల్ 24 న Zee5 లో మొదలైన రాధకు నీవెరా ప్రాణం సీరియల్ మంచి పేరు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో పోలీస్ ఆఫీసర్ హీరో గా నిరుపమ పరిటాల హీరోయిన్ పల్లవి గా చైత్ర నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

Radhaku Neevera Pranam ఎపిసోడ్ 1: ప్రేమ ఫిలాసఫీ…పుట్టిన రోజు పండుగ
చాలా రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ తో రాధకు నీవెరా సీరియల్ మొదలవుతుంది. ఇది చూడగానే చూసిన వారికి మంచి ఫీలింగ్ కలుగుతుంది. పల్లవి పల్లవి అంటూ పుట్టిన రోజు కోసం అలంకరించిన ఇంటి గార్డెన్ లో తన భార్య కోసం వెతుకుతూ ఉంటాడు కార్తీక్. గులాబీ రేకుల కుప్పలో దాక్కుని ఉన్న పల్లవి తన భర్తను ఆట పట్టిస్తుంది. చివరికి దొంగ అంటూ కార్తీక్ పల్లవిని పట్టుకుని ప్రేమగా ఐ లవ్ యు అని అంటాడు. 1456వ సారి అని అంటుంది పల్లవి…ఏంటి ఆ నెంబర్ లెక్కల మాస్టర్ లా అని అడుగుతాడు కార్తీక్. మా ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉందొ తెలియాలి కదా అందుకె ఇప్పటివరకు ఎన్ని సార్లు ఐ లవ్ యు చెప్పావో అని మొత్తం 1456 సార్లు చెప్పావ్ అంటుంది పల్లవి. రెండు చేతులతో పల్లవిని పట్టుకొని ‘నా అందమైన ప్రేమికురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ముద్దు పెడతాడు కార్తీక్.

తన భర్త తన కోసం ప్రేమతో ఏర్పాటు చేసిన రొమాంటిక్ సెటప్ బర్త్ డే కేక్ ను చూసి చాలా ఆనంద పడుతుంది పల్లవి. ఇక్కడ నెక్స్ట్ సీన్ లో కార్తీక్ నుంచి కొంచెం ప్రేమ ఫిలాసఫీ వింటారు ఆడియన్స్. పల్లవి ప్రపంచం లో చాలా మంది పుడతారు కానీ మన కోసం మాత్రం ఒక్కరే పుడతారు… అలాంటి వారిని మన ముందు నిలబెట్టేదే ప్రేమ అని అంటాడు కార్తీక్.
తన ప్రేమను…తన భార్యను కోల్పోయిన కార్తీక్
అయితే ఒక్కసారిగా సీన్ మారిపోతుంది…బర్త్ డే కేక్ పల్లవికి తినిపించే సమయానికి పల్లవి మాయం అయిపోయి ఆమె ఫోటో మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకు జరిగినది కార్తీక్ ఊహ మాత్రమే ఎందుకంటే అక్కడే ఉన్న పల్లవి సమాధి మనకు చూపిస్తారు.
తరువాత సీన్ లో కార్తీక్ ఏడుస్తూ పల్లవి సమాధి దెగ్గర నిలబడతాడు…వర్షం పడటం మొదలవుతుంది. కార్తీక్ పల్లవి సమాధి వొంక చూస్తూ ఇలా అంటాడు ‘ఐ మిస్ యు పల్లవి నువ్వు లేని ఈ లోకంలో నాకు నవ్వు లేదు, నువ్వు ఊపిరి పీల్చని ఈ భూమి మీద నాకు ఊపిరే లేదు’… ఇలా కార్తీక్ బాధ పడుతూ తనకు చనిపోయిన పల్లవి మీద ఎంత ప్రేమ ఉంది అని అర్ధం అయ్యేలా మాటలు చెప్తాడు.
ఎక్కడ దాక్కున్నా దానిని వదిలి పెట్టను
పల్లవి సమాధి దెగ్గర వర్షం లో’ఉన్న కార్తీక్ తన భార్యను చంపిన వ్యక్తిని గుర్తుచేసుకొని ఇలా అంటాడు … ‘దేవుడు నాకు నీతో వంద ఏళ్ళు ఇచ్చాడు కానీ ఆ దెయ్యం నాలుగు ఏళ్లకే నిన్ను నా నుంచి దూరం చేసింది, అది ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దానిని వదిలి పెట్టను పట్టుకొని ఉరిశిక్ష వేయిస్తాను అప్పుడే నాకు మనశ్శాంతి నీ ఆత్మకు శాంతి’ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ఒక ఆర్టిస్ట్ కథ… రాధిక పాత్ర పరిచయం
కార్తీక్ కి పూర్తి బిన్నంగా ఉన్న ఒక పాత్ర పరిచయం అవుతుంది. అందంగా నడుస్తూ అందరిని కలుపుకొని బీచ్ లో మనకి ఆర్టిస్ట్ రాధిక కనిపిస్తుంది. అక్కడ బీచ్ లో ఉన్న వారితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది రాధిక. ఒక టేబుల్ ఇంకా పెయింటింగ్ కోసం బ్రష్ లు అన్ని తీసి బీచ్ లో ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తరువాత మైక్ పట్టుకొని పెయింటింగ్ వేయించుకోండి తాను బొమ్మలు వేయటం లో దిట్ట అని అందరిని పిలుస్తుంది.

కార్తీక్ కుటుంబం మరియు ఇల్లు పరిచయం
కొమ్మ అనే పనిమనిషి ని ముందుగా మనకు పరిచయం చేస్తారు… కొమ్మ పాత్రను ప్రధానంగా హాస్యం కోసం వాడుకోబోతున్నారు అని మనకు అర్ధం అవుతుంది. ఆ తరువాత కార్తీక్ మామ ఓంబాబు ను తరువాత తల్లి ధర్మవతిని ఇంకా తండ్రిని పరిచయం చేస్తారు. ధర్మావతి కార్తీక్ ఎక్కడ అని పిలుస్తుంది… పోలీస్ యూనిఫామ్ లో స్టైల్ గా ఇంట్లో మెట్లు దిగుతూ వొస్తాడు కార్తీక్.

పల్లవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని కార్తీక్ తో ధర్మావతి అంటుంది. అందుకనే అమ్మ నువ్వంటే నాకు ఇష్టం, నా మనసులో ఉన్నవారిని కూడా గుర్తుపెట్టుకుంటావ్ అని కార్తీక్ అంటాడు. కార్తీక్ కి ఒక సన్మానం ఉంటుంది దాని కోసం కుటుంబం మొత్తం తయారు అవుతారు…మొదట కార్తీక్ రాను అంటాడు కానీ తరువాత తల్లి కోసం సన్మానానికి వస్తా అని ఒప్పుకుంటాడు. ఆ తరువాత మరికొన్ని ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తారు రాధకు నీవేరా ప్రాణం సీరియల్ మొదటి ఎపిసోడ్ లో. ఇంకా ఈ సీరియల్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Brahmamudi ఏప్రిల్ 25: స్వప్న రాహుల్ గురించి బయట పెడుతుందా? కావ్య జీవితం మారబోతుందా..