Radhaku Neevera Pranam: కార్తీకదీపం సీరియల్ ఈ పేరు చెప్పగానే ముందుగానే గుర్తొచ్చే పేరు డాక్టర్ బాబు.. నిరూపమ్ పరిటాల ఇప్పుడు సరికొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. అదే రాధకు నీవేరా ప్రాణం.. ఈ సీరియల్ జీ తెలుగు లో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది.. ఈ సీరియల్ కాన్సెప్ట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇప్పటికే ఈ సీరియల్ ఈ సాంగ్ ప్రోమో విడుదలవ్వగా బాగా ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా ఈ సీరియల్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో డాక్టర్ బాబుతో పాటు ఇద్దరు హీరోయిన్లను పరిచయం చేశారు. నిరుపమ్ బీచ్‌లో ఒంటరిగా తిరుగుతుంటాడు. ఇంతలో ఓ అమ్మాయి (చైత్ర) తన దగ్గరికి పరిగెత్తుకెళ్లి చేయిపట్టుకుంటాడు. కానీ తను పట్టుకుంది మరో హీరోయిన్ (గోమతి ప్రియ) చేయి. దీంతో వెంటనే ఆ చేయి వదిలేసి ఆమెకు సారీ చెబుతాడు. కానీ ఆమె మాత్రం డాక్టర్ బాబు వైపే కాస్త ఆశ్చర్యం, మరి కాస్త ఇష్టంతో చూస్తూ ఉంటుంది.
ఈ ప్రోమో లో హీరోను చూసి ఇష్టపడిన హీరోయిన్ బీచ్‌లోనే హీరో బొమ్మను వేస్తుంది. ఈ సీరియల్‌లో హీరోయిన్ ఓ పెయింటర్. ఆమె గుండెచప్పుడు అతను, ఆ గుండె వెనుక గతం, అతని జీవితం అంటూ టైటిల్‌కు ఇచ్చిన క్యాప్షన్ బట్టే ఇద్దరి మధ్య నలిగే కృష్ణుడు అని అర్థం అవుతుంది.
ఈ సీరియల్ లో పోలీస్‌గా చేస్తున్న నిరుపమ్‌కు ఓ ట్రాజెడీ గతం ఉంటుందని అర్థమవుతుంది. అందులో చైత్రను హీరో ప్రేమిస్తాడు. కానీ ఆమె హీరోకు దూరం అవుతుంది. కానీ ఆమె జ్ఞాపకాలే ఊపిరిగా హీరో బతుకుతూ ఉంటాడు. కానీ ఎందుకో మరో హీరోయిన్ ను చూసినప్పుడు హీరోకు చైత్ర గుర్తొస్తుంది. ఈ హీరోయిన్ కూడా తొలి చూపులోనే హీరోను చూసి మనసు పారేసుకుంటుంది. రాధకు ప్రాణం నివెరా అన్నట్టు ఇద్దరి మధ్య నలిగే కృష్ణుడా లేదంటే ఇద్దరి మధ్య గతం ఏదైనా ఉందా? ఆ గతం తాలూకా గుర్తులను రెండవ హీరోయిన్ భర్తీ చేస్తుందా? మిగతా కదంతా తెలియాలి అని అనుకుంటే మాత్రం ఏప్రిల్ 24 వరకు వేచి చూడక తప్పదు. మరో వారం రోజుల్లోనే నీరూపమ్ తన కొత్త సీరియల్తో ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చేస్తున్నాడు.