సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం `జైలర్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `వరుణ్ డాక్టర్`, `మాస్టర్` చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రజినీకాంత్ నటిస్తోన్న 169వ చిత్రమిది
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. `జైలర్`గా రజనీకాంత్ డ్యూటీ ఎక్కేశారు. ఈ రోజు సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. `నేడు జైలర్ తన యాక్షన్ స్టార్ట్ చేశారు` అని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది.
అంతే కాదు.. రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకు వదిలారు. అందులో ఆయన కళ్లకి అద్దాలు, నెరిసిన తల.. గడ్డంతో ఫార్మల్ డ్రెస్ ధరించి పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈయన లుక్ చూస్తుంటే.. ఖైదీల తాట తీయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఆకట్టుకున్న రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా మేకర్స్ అధికారికంగా తెలియజేయలేదు. ఐశ్వర్యా రాయ్, నయనతార, తమన్నా తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరూ ఇంకా ఫైనల్ అవ్వలేదు. మరి ఈ మూవీని రజనీ సరసన మెరిసే బ్యూటీ ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
#Jailer begins his action Today!@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/6eTq1YKPPA
— Sun Pictures (@sunpictures) August 22, 2022
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!