రకుల్ ప్రీత్ సింగ్: స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు ఊహించిన స్థాయిలో సక్సెస్ అందట్లేదు. ఆమెకు అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ఛత్రివాలి’ నిరాశే మిగిల్చింది. తమిళంలోని నటించిన ‘ధీన్ అధికారం, ఒండ్రు’ వంటి ఒకటి రెండు సినిమాలు మినహా సరైన సక్సెస్ రాలేదు. దాంతో రకుల్ భారీ విజయాన్ని అందుకుని చాలా కాలమే అయిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఈ భామ.. ఇటీవల కాస్త వెనుకబడిందనే చెప్పుకోవచ్చు.
రకుల్ ప్రీత్ సింగ్ Indian-2లో నాయికగా..
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్వకత్వంలో ఇండియన్-2 సినిమాలో ఓ నాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరోగా విశ్వనటుడు కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఒకప్పుడు కమల్ హాసన్‌తో చేసిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
Chhatriwali Review: శృంగార పాఠాలు చెప్పిన రకుల్.. సినిమా ఎలా ఉందంటే?
ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం..
ఇటీవల ఓ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..‘విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి నేను నటించడం చాలా గొప్ప విషయం. నటనలో ఆయనో విశ్వవిద్యాలయం. ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఆయన సినిమాలో నటించే అవకాశం రాదు. వందేళ్ల భారతీయ సినిమాలు తీసుకుంటే.. అందులో 60 ఏళ్లలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి మహా నటులే ఉంటారు. అడ్డదారిలో విజయాలు రావని మనకు తెలియజేసిన నటులు వారు. మనం చేసే పనిలో శ్రద్ధ వహించాలి. అప్పుడే వారిలా విజయాన్ని సాధించగలము.’ అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం రకుల్ ఇండియన్-2, శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్న ‘అయలాన్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలపైనే రకుల్ హోప్స్ పెట్టుకుంది.
Related Articles: Chhatriwali Review: శృంగార పాఠాలు చెప్పిన రకుల్.. సినిమా ఎలా ఉందంటే?
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!