రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఓ కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లోకి అడుగు పెట్టి.. తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఇక్కడ అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తన ఫోకస్ మొత్తానికి బాలీవుడ్‌పై మల్లించింది. వరుస అవకాశాలను అందుకుంటూ అక్కడ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
అలాగే మరోవైపు సోషల్ మీడియాలో వేదికగా అందాలను ఆరబోస్తూ.. తన ఫాలోవర్స్ సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. తాజాగా కూడా బ్లాక్ ట్రెండీ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో సూపర్ స్టైలిష్‌గా దర్శనమిచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి వీటిని చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. అంత గ్లామరస్‌గా రకుల్ కనిపిస్తోంది.
కాగా, రకుల్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈమె ఎలాంటి సినిమాలు చేయడం లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘అయాలాన్’, ‘ఛత్రివాలి’,‘ఇండియన్ 2’ చిత్రాలు చేస్తోంది. తమిళంలో ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ చిత్రాలోనూ నటిస్తోంది.