మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా గౌతమ్-రామ్ చరన్ ప్రాజెక్డ్ ఆగిపోయింది.

ఇక గౌతమ్ సైడ్ అవ్వడంతో.. రామ్ చరణ్ 16వ చిత్రం ఎవరితో ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఆల్రెడీ గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన `రంగస్థలం` బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
అయితే మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతోందట. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని సుకుమార్ తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. కాగా, సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప 2` సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత చరణ్ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
https://newsorbit.com/cinema/ram-charan-created-a-record-on-instagram.html