మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. `ఆర్సీ` 15 వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్ జె సూర్య, జయరాం తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కొంత షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.
ఇంతలో `ఇండియన్ 2` తెరపైకి రావడంతో `ఆర్సీ15` చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని కీలకమైన ఫోటోలు లీక్ అయ్యాయి. రామ్ చరణ్, అంజలికి సంబంధించిన ఫోటోలు ఇవి. అయితే ఈ ఫోటోలు బట్టి చూస్తుంటే ఆర్సీ 15లో రామ్ చరణ్ కు భార్యగా అంజలి కనిపించబోతుందని స్పష్టంగా తేలిపోయింది.
అలాగే ఈ ఫోటోల్లో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్-అంజలికి జన్మించిన ఆ బాబే యంగ్ రామ్ చరణ్ అని అంటున్నారు. ఇందులో ఓల్డ్ రామ్ చరణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడని, యంగ్ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా అలరించనున్నాడని టాక్ నడుస్తోంది.
https://newsorbit.com/cinema/rc-15-movie-release-date-update.html