NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. వివాహమైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన జంట త‌మ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్ పలికారు. గత ఏడాది జూన్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మెగా కపుల్ తమ ముద్దుల కూతురుకు క్లిన్ కారా అంటూ నామకరణం చేశారు. అయితే ఇంతవరకు రామ్ చరణ్, ఉపాసన జంట తమ కూతురి ఫేస్ ను రివీల్ చేయలేదు. కానీ ఇటీవల తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్నా మీడియా వారు క్లీన్ కారాను ఫోటో తీశారు. దాంతో చిన్నారి ఫేస్ రివీల్ అయిపోయింది.

ఈ సంగతి పక్కన పెడితే.. ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డెలివరీ అనంతరం తనకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయో తెలిపారు. క్లిన్ కారా పుట్టాక‌ రామ్ చరణ్ తనకు ఏ విధంగా మద్దతును ఇచ్చారో ఉపాసన వివరించారు. `ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఒక అద్భుతమైన విషయం. అయితే డెలివరీ అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. మహిళలకు ఒకరకంగా అది పునర్జన్మ. డెలివరీ తర్వాత చాలా మంది లాగానే నేను కూడా తీవ్ర డిప్రెషన్(పోస్టుమార్టం డిప్రెషన్) కు లోనయ్యాను.

ఆ సమయంలో నాకు నా భర్తే థెరపిస్టుగా మారారు. డిప్రెషన్ లో ఉన్న నాకు అండగా నిలిచాడు. నాతో పాటు రామ్ చ‌ర‌ణ్‌ నా పుట్టింటికి వచ్చేశాడు నిజంగా ఇటువంటి అదృష్టం అందరికీ దొరకదు. భార్య తల్లిగా మారే సమయంలో భర్త సపోర్ట్ అనేది ఎంతో అవసరం. క్లిన్ కారా విషయంలోనూ చరణ్ చాలా ప్రేమ‌, శ్రద్ద చూపిస్తాడు. నా భర్త నా కూతురిని చూసుకునే విధానం చూస్తే ముచ్చటేస్తుంది` అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. అలాగే క్లిన్ కారాను తాము ఎప్పుడైనా ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తనకంటే మేమే ఎక్కువ బాధపడతామని ఉపాసన తెలిపింది. దీంతో ఉపాసన కామెంట్స్ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారాయి.

కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే మూవీ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య‌, శ్రీ‌కాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మరికొద్ది నెలలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక గేమ్ ఛేంజ‌ర్‌ అనంతరం రామ్‌ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఉప్పన ఫేమ్ బుచ్చిబాబుతో చేస్తున్నాడు. ఆర్సీ 16 వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఇందులో శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది. త్వరలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.

Related posts

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju