33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

జిమ్‌లో చ‌ర‌ణ్ క‌ఠిన‌మైన క‌స‌ర‌త్తులు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Share

ఇటీవ‌ల `ఆర్ఆర్ఆర్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకుని పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్‌తో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అలాగే అంజ‌లి, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, జ‌య‌రామ్‌, శ్రీ‌కాంత్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్‌లు హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ త్రిపాత్రాభిన‌యం చేయ‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇక‌పోతే ఈ మూవీ కోసం చ‌ర‌ణ్ కాస్త గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇందుకు చ‌ర‌ణ్ నేడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన వీడియోనే నిద‌ర్శ‌నం.

ఈ వీడియోలో ఆదివారం ఉద‌యం జిమ్‌లో ట్రైనింగ్ నిపుణుడు రాకేష్ ఉడియార్ ఆధ్వర్యంలో చ‌ర‌ణ్ క‌ఠిన‌మైన క‌స‌ర‌త్తులు చేస్తూ చెమ‌ట‌లు చిందించాడు. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన ఈ వీడియోను చూస్తే ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. మ‌రి లేటెందుకు దానిపై మీరు ఓ లుక్కేసేయండి.


Share

Related posts

కాల‌ర్ ఎగ‌రేసిన మ‌హేష్‌

Siva Prasad

Virata Parvam Release Date: విరాటపర్వం మువీ విడుదలపై డైరెక్టర్ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

bharani jella

sai dharam tej : సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ కి ‘రిపబ్లిక్’ అన్న టైటిల్ ఫిక్స్ ..!

GRK