`ఇస్మార్ట్ శంకర్` మూవీ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్లీ వరుస ఫ్లాపుల్లో మునిగి పోతున్నాడు. ఈయన నుంచి చివరగా వచ్చిన `రెడ్`, `ది వారియర్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే వరుస ఫ్లాపుల్లోనూ రామ్ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో రామ్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
రామ్ కెరీర్లో 20వ ప్రాజెక్ట్ ఇది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే రామ్ మరో స్టార్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు గౌతమ్ వాసుదేవ మీనన్.
ఈయనకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడీన. అయితే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `తాంధు వెనిందాతు కాదు` మూవీ తమిళంలో గురువారం విడుదలైంది.
శింబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో సెప్టెంబర్ 17న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్.. రామ్ పోతినేనితో ఒక సినిమాను చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని అప్డేట్స్ బయటకు రానున్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ న్యూస్ తో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!