టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి తొలిసారి జంటగా నటించిన చిత్రం `ది వారియర్`. తమిళ దర్శకుడు ఎన్. లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తే.. నదియా, అక్షర గౌడ్, రాక్ స్టార్, జయ ప్రకాశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఒకే వేదికపై సందడి చేయనున్న బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్..స్పెషల్ ఏంటో?
ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కృతి శెట్టితో కలిసి రామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ కృతి శెట్టి ఏజ్‌పై ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోనే బేబమ్మ వయసుపై రామ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎంత ట్రై చేసినా కృతి శెట్టిన తన వయసు మాత్రం చెప్పలేదట.
అసలేమైందంటే.. `వయసులో కృతి శెట్టి చిన్నది కావచ్చు. కానీ, టాలెంట్ పరంగా సూపర్బ్. ఆమె గురించి చెప్పండి` అని రామ్‌ను అడగగా.. అందుకు ఆయన `కృతి శెట్టి ఏజ్ సంగతి తెలియదు. నేను చాలాసార్లు అడిగాను. చెప్పలేదు. అబ్రాడ్ సాంగ్ ఉంటే తెలిసేది. పాస్ పోర్ట్ వస్తుంది కాబట్టి అందులో చూడొచ్చు. నటనకు వస్తే… కృతి శెట్టి చాలా మెచ్యూర్డ్. ఆమెకు పని పట్ల అంకిత భావం, సినిమాలపై గౌరవం రెండు ఉన్నాయి. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!