NewsOrbit
Entertainment News సినిమా

రామ్ ఎంత ప‌ని చేశాడు.. హిట్ మూవీని వ‌దిలేసి ఫ్లాప్‌ను ప‌ట్టుకున్నాడు!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మ‌ళ్లీ వ‌రుస ఫ్లాపుల్లో మునిగిపోతున్నాడు. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కి మాస్ హీరోగా అవ‌త‌రించిన రామ్‌.. ఆ త‌ర్వాత `రెడ్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. మొన్నామ‌ధ్య `ది వారియ‌ర్‌`తో ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో వ‌చ్చాడు.

ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఆది పినిశెట్టి విల‌న్‌గా చేశాడు. రామ్ కెరీర్‌లోనే తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్ గా చేసిన సినిమా ఇది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాష‌ల్లో విడుద‌ల మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కించుకుంది.

టాక్ అంతంత మాత్రంగా ఉండ‌టంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కూడా యావ‌రేజ్‌గానే ఉన్నాయి. ఈ సినిమా వ‌ల్ల బ‌య్య‌ర్లు భారీ నష్ట‌పోయారు. కెరీర్ లో మొదటిసారి రామ్ పోలీస్ పాత్ర ట్రై చేయగా బెడిసికొట్టింది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంతో రామ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. `గ‌తంలో నాలుగైదు పోలీస్ క‌థ విన్నాను. అన్నీ రొటీన్‌గా ఉండ‌టం వ‌ల్ల రిజెక్ట్ చేశా. ది వారియ‌ర్ క‌థ విభిన్నంగా ఉండ‌టంతో వెంట‌నే ఓకే చెప్పాను` అని చెప్పుకొచ్చారు.

అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. రామ్ రిజెక్ట్ చేసిన పోలీస్ క‌థ‌ల్లో `క్రాక్‌` కూడా ఒక‌ట‌ని అంటున్నారు. గోపీచంద్ మ‌లినేని, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌ కాంబోలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ ఇది. ఈ సినిమా క‌థ మొద‌ట రామ్ వ‌ద్ద‌కే వెళ్ల‌గా.. ఆయ‌న సున్నితంగా నో చెప్పార‌ని తాజాగా ఓ వార్త నెట్టింట షికార్లు చేస్తోంది. దీంతో అభిమానులు అయ్మో రామ్ ఎంత ప‌ని చేశాడు. క్రాక్ వంటి హిట్ మూవీని వ‌దిలేసి, ది వారియ‌ర్ వంటి ఫ్లాప్‌ను ప‌ట్టుకున్నాడు అంటూ క‌ల‌వ‌ర ప‌డుతున్నారు.

author avatar
kavya N

Related posts

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu