మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. ఇందులో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో వేణు కీలక పాత్రను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించాడు.
జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓ ప్రభుత్వ అధికారిగా రవితేజ యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లో అదరగొట్టేశారు. సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉంది. కానీ, ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. సినిమాపై ప్రేక్షకులే కాదు రవితేజ అభిమానులు సైతం పెదవి విరిచారు.
టాక్ యావరేజ్‌గా ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 2.82 కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 46 లక్షల షేర్‌ను మాత్రమే వసూల్ చేయగలిగింది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 54 లక్షల షేర్‌తో సరిపెట్టుకుంది. ఏదేమైనా రవితేజ లాంటి హీరో రెండో రోజు మరీ ఇంత తక్కువ కలెక్షన్స్ రాబట్టం పెద్ద అవమానమే. ఇక ఏరియాల వారీగా రామారావు ఆన్ డ్యూటీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్‌ను ఓసారి గమనిస్తే..
నైజాం: 1.03 కోట్లు
సీడెడ్: 0.59 కోట్లు
ఉత్తరాంద్ర: 0.50 కోట్లు
తూర్పు: 0.35 కోట్లు
పశ్చిమ: 0.19 కోట్లు
గుంటూరు: 0.28 కోట్లు
కృష్ణ: 0.20 కోట్లు
నెల్లూరు: 0.14 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ= 3.28 కోట్లు(5.50కోట్లు~ గ్రాస్)
——————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.28 కోట్లు
ఓవర్సీస్: 0.40 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్=3.96కోట్లు(6.85కోట్లు~ గ్రాస్)
———————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 18 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే.. తొలి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా రూ.14.04 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది.