ఇంట్ర‌స్టింగ్‌గా `రామారావు` ట్రైల‌ర్‌.. ర‌వితేజ వేట మొద‌లైంద‌ట‌!

Share

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. సీనియ‌ర్ హీరో వేణు, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం జులై 29న విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌రుస అప్డేట్స్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్న మేక‌ర్స్‌.. తాజాగా `రామారావు ఆన్ డ్యూటీ` ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఒక ఆపరేషన్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం.. ఒక పాప తన తండ్రిని వెతకడంలో సహాయం చేయమని అడగడంతో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఫుల్ ఇంట్ర‌స్టింగ్‌గా సాగింది. `ఇన్నాళ్లు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్టప్రకారం డ్యూటీ చేసిన నేను, ఇకపై రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను` అంటూ ర‌వితేజ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది.

రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. అయితే ధర్మం కోసం ఆ క‌లెక్ట‌ర్ చట్టాన్ని పక్కన పెడితే ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి అన్న‌దే ఈ సినిమా క‌థ అని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇద్దరు హీరోయిన్లతో ర‌వితేజ లాక్ ట్రాక్‌, ఫైట్స్‌, విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు కూడా ఆక‌ట్టుకున్నాయి. ఇక చివ‌ర్లో అస‌లు వేట మొద‌లైంది అంటూ ర‌వితేజ చెప్ప‌డం ఇంకా బాగా అల‌రించింది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను ర‌వితేజ అందుకుంటాడో..లేదో..చూడాలి.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

21 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago