`రామారావు ఆన్ డ్యూటీ`.. మాస్ మహారాజ్ రవితేజ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ ఇది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరో వేను తొట్టెంపూడి, నాజర్, నరేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ మాస్ ఎంటర్టైనర్ జూలై 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో నిజాయితీ గల ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో రవితేజ అలరించబోతున్నాడు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ కూడా ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశ పడుతున్నారు.
బిజినెస్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా `రామారావు`కు సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్లు బిజినెస్ జరగగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసిందీ చిత్రం. ఇక రామారావు ఆన్ డ్యూట్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఓసారి గమనిస్తే..
నైజాం – 5 కోట్లు
సీడెడ్ – 3 కోట్లు
ఆంధ్రా – 7 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ= 15.00 కోట్లు
——————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఓవర్సీస్ – 1.2 కోట్లు
———————————-
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్= 17.20 కోట్లు
———————————-
రూ. 17 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 18 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగితోంది. దీంతో రవితేజ హిట్ కొట్టాలంటే.. రూ. 18 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది.