Subscribe for notification

Raviteja: ర‌వితేజ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..రామారావు డ్యూటీ ఎక్కేస్తున్నాడోచ్‌!

Share

Raviteja: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మింస్తున్నారు. రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు.

నాజ‌ర్‌, వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ర‌వితేజ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే గుడ్‌న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే రామారావు డ్యూటీ ఎక్క‌బోతున్నాడ‌ట‌. విష‌యం ఏంటంటే.. ఈ మూవీ రిలీజ్ కి మేక‌ర్స్ డేట్ లాక్ చేశారు.

వాస్త‌వానికి మొద‌ట ఈ చిత్రాన్ని మార్చి 25 లేదా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, మార్చి 25న ఆర్ఆర్ఆర్‌, ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 వంటి భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో రామారావు ఆన్ డ్యూటీ ని జూన్ 17కు షిఫ్ట్ చేయ‌గా.. ప‌లు సాంకేతిక కారణాల వ‌ల్ల ఈ తేదీన కూడా రిలీజ్ చేయ‌డం కుద‌ర‌లేదు.

అయితే కొంతసేపటి క్రితం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేక‌ర్స్‌. వచ్చే నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. కాగా, ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచ‌గా.. మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు జూలై ఆరంభం నుంచీ మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను షురూ చేయ‌నున్నారు.


Share
kavya N

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

4 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

1 hour ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago