మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మూడో చిత్రమే `రంగ రంగ వైభవంగా`. గిరీశాయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తే.. ప్రభు, నరేష్, సత్య, సుబ్బరాజు, ఆలి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. భారీ అంచనాల నడుమ నేడు అట్టహాసంగా ప్రేక్షకులను ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, వారి కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్ బావున్నా దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్ప్లే, సెకెండాఫ్, తేలిపోయిన క్లైమాక్స్ పెద్ద మైనస్లు మారాయి.
మరి ఇలాంటి టాక్ తో వైష్ణవ్ హిట్ అందుకోవాలంటే ఎంత రాబట్టాలి..? అసలు రంగ రంగ వైభవంగా వరల్డ్ వైడ్గా ఎంత బిజినెస్ చేసింది..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా ఓవరాల్ గా రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఆ లెక్కలను ఓసారి గమనిస్తే..
నైజాం: 2.6 కోట్లు
సెడెడ్: 1.3 కోట్లు
ఆంధ్రా: 3.6 కోట్లు
—————————
ఏపీ+తెలంగాణ = 7.50 కోట్లు
—————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీ: 1.00కోట్లు
—————————————————-
వరల్డ్ వైడ్ బిజినెస్= 8.50కోట్లు(బ్రేక్ ఈవెన్ – 9.00కోట్లు)
—————————————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. నేడు రూ. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మరి మిక్స్డ్ టాక్ తో వైష్ణవ్ ఈ రేంజ్ వసూళ్లను రాబడతాడో..లేదో.. చూడాలి.