మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, `రొమాంటిక్` ఫేమ్ కేతిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం `రంగ రంగ వైభవంగా`. గిరీశాయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. రాక్ స్టార్ దేవశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభు, నరేష్, సత్య, సుబ్బరాజు, ఆలి తదితరులు కీలక పాత్రలను పోషించారు. అనేక వాయిదాల అనంతరం సెప్టెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకులను ముందుకు వచ్చింది. అయితే కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో.. ఈ సినిమాకు తొలి షో నుంచే మిశ్రమ స్పందించింది.
ఇక టాక్ కు తగ్గట్లే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. వసూళ్ల పరంగా తొలి రోజు వైష్ణవ్ జస్ట్ ఓకే అనిపించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 96 లక్షల షేర్‌తో సరిపెట్టుకున్న `రంగరంగ వైభవంగా`.. వరల్డ్ వైడ్‌గా రూ. 1.07 కోట్లను రాబట్టింది. ఇక ఏరియాల వారీగా `రంగరంగ వైభవంగా` ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 31 లక్షలు
సీడెడ్: 10 లక్షలు
ఉత్తరాంధ్ర: 12 లక్షలు
తూర్పు: 9 లక్షలు
పశ్చిమ: 6 లక్షలు
గుంటూరు: 16 లక్షలు
కృష్ణ: 7 లక్షలు
నెల్లూరు: 5 లక్షలు
———————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 0.96కోట్లు(1.65కోట్లు~ గ్రాస్)
——————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 4 లక్షలు
ఓవర్సీస్- 7 లక్షలు
————————————
వరల్డ్ వైడ్ కలెక్షన్= 1.07కోట్లు(1.90కోట్లు~ గ్రాస్)
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. నిన్న రూ. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఈ టార్గెట్ ను వైష్ణవ్ రీచ్ అవ్వాలంటే.. తొలి రోజు వచ్చిన వసూళ్లు కాకుండా ఇంకా రూ. 7.93 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!