Rashi Khanna: అలాంటి వాళ్ల‌కు నేను ఎప్పుడూ దూర‌మే అంటున్న రాశి ఖ‌న్నా!

Share

Rashi Khanna: రాశి ఖ‌న్నా.. మూడు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ్యాచో హీరో గోపీచంద్‌, మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద తొలి రోజు అదిరిపోయే క‌లెక్ష‌న్స్ రాబట్టింది. రెండు, మూడు రోజుల్లోనూ బాగానే వ‌సూల్ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా రాశి ఖ‌న్నా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్యక్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఒక స్థాయికి చేరుకున్నాక స్టేటస్‌ మెయింటైన్‌ చేయాలని అనేవాళ్లు మన చుట్టూ ఉండటం కామన్‌, మీకూ అలా ఉన్నారా..? అనే ప్ర‌శ్న ఎదురైంది.

అందుకు రాశి ఖ‌న్నా.. `అలాంటివి చెప్పడానికి చాలామంది ఉంటారు. కానీ, నేను ఎప్పుడూ అలాంటి వారికి దూరంగా ఉంటా. నాకంటూ ఒక మైండ్‌ ఉంది. అది చెప్పిన ప్రకారమే ఫాలో అవుతాను. అసలు నన్ను నేను సెలబ్రిటీలా ఎప్పుడూ అనుకోలేదు. సెలబ్రిటీ, కామన్‌ పీపుల్‌ అనే తేడా నాకు ఉండదు. కాబట్టి స్టేటస్ కి ప్రాధాన్యం ఇవ్వను.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

కాగా, త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ `థ్యాంక్యూ` చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతోంది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ చిత్రం జూలై 22న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. అలాగే మ‌రోవైపు రాశి ఖ‌న్నా బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సిద్ధార్థ్ మల్హోత్రాతో క‌లిసి `యోధ` అనే మూవీ చేస్తోంది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

28 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

37 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago