రాశి ఖన్నా.. తెలుగు, తమిళ్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన అందం, టాలెంట్‌తో టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో క్రేజీ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది.
పైగా కెరీర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉన్న రాశి ఖన్నా.. ఈ మధ్య బక్క చిక్కి వరుస ఆఫర్లను అందుకుంటోంది. అయితే ఈ భామకు గత కొంత కాలం నుంచి బ్యాడ్ టైమ్ బాగా నడుస్తోంది.
ఈ బ్యూటీ చేసిన చిత్రాలన్నీ వరసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఈమె నుంచి చివరిగా `వరల్డ్ ఫేమస్ లవర్`, `అంతఃపురం`, `పక్కా కమర్షియల్`, `థ్యాంక్యూ` చిత్రాలు వచ్చాయి.
ఇవేమి రాశి ఖన్నాకు హిట్ అందించలేకపోయాయి. ప్రస్తుతం తమిళంలో కార్తీతో `సర్దార్` అనే సినిమా చేస్తుంది. అలాగే హిందీలో ‘యోదా’ తో పాటు పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్లను కుర్రాకారు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా కూడా వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్‌లో హద్దులు దాటేసి మరీ అందాలు ఆరబోసింది.
ఇందుకు సంబంధించిన పిక్స్ చూస్తే ఎవ్వరికైనా చెమటలు పట్టాల్సిందే. అంతా హాట్‌గా రాశి ఖన్నా అలరిస్తోంది. మొత్తానికి రాశి ఖన్నా తాజా పిక్స్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి.