`మనం` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి..`ఊహలు గుసగుసలాడే`తో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్గా ముద్దు వేయించుకుని టాలీవుడ్లో స్టార్ హీరోలతో ఆడిపాడిందీ భామ.
అయితే రాశి ఖన్నా గత కొంత కాలం నుండీ అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఈమె చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఈమె నుంచి చివరిగా వచ్చిన ఆక్సీజన్, టచ్ చేసి చూడు, శ్రీనివాస కళ్యాణం, ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మొన్నామధ్య `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించింది.
అతడితోనే డేట్‌కి వెళ్తానంటున్న రాశి ఖన్నా.. చైతు రిప్లై వైరల్!
గోపీచంద్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందనతో బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. దీంతో రాశి ఖన్నా వరుస ఫ్లాపులతో కష్టాల్లోకి కూరుకుపోయింది. ఈమె కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే.. అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ఈ నేపథ్యంలోనే రాశి ఖన్నా తన ఆశలన్నీ నాగచైతన్య నటించిన `థ్యాంక్యూ` మీదే పెట్టుకుంది.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాశి ఖన్నాతో పాటు మాళవిక నాయర్, అవికా గోర్ సైతం హీరోయిన్లుగా నటించారు. జూలై 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీతో అయినా రాశి ఖన్నా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతోంది. మరి నాగచైతన్య అయినా ఆమెకు హిట్ ఇచ్చి ఆదుకుంటాడో..లేదో..చూడాలి.