బాలీవుడ్‌లో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ర‌ష్మిక అస్సలు త‌గ్గ‌ట్లేదుగా!

Share

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ క‌న్న‌డ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. `ఛలో`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన టాలెంట్‌తో ఇక్క‌డ‌ అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైస్‌`లో శ్రీ‌వ‌ల్లిగా న‌టించి.. త‌న స్టార్డ‌మ్‌ను డ‌బుల్ చేసుకుని త‌గ్గేదే లే అంటూ దూసుకుపోతోంది.

ప్ర‌స్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి.. తాజాగా బాలీవుడ్‌లో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించింద‌ట‌. ఇప్ప‌టికే హిందీలో ఈమె `మిషన్ మజ్ను`, `గుడ్ బై` చిత్రాలు చేస్తోంది. ఇటీవలె ర‌ణ్ బీర్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ `యానిమ‌ల్‌`లో హీరోయిన్‌గా ఎంపిక అయింది.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ మ‌రో బాలీవుడ్ హీరోతో రొమాన్స్ చేయ‌బోతోంది. ఆ హీరో ఎవ‌రో కాదు యంగ్ అండ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్. ఈయ‌న ప్ర‌ముఖ బాలీవుడ్ దర్శకుడు శశాంక్ ఖైతాన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ర‌ష్మికను తీసుకున్నార‌ట‌.

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని అంటున్నారు. అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయినా.. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ర‌ష్మిక ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. తెలుగుతో `పుష్ప 2`, త‌మిళంలో `వార‌సుడు`, మ‌లయాళంలో `సీతా రామం` చిత్రాలు చేస్తోంది.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

18 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago