21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

వైర‌ల్ వీడియో: ఒకే వేదిక‌పై మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన ర‌ష్మిక-కృతి శెట్టి!

Share

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మలు ఇద్దరూ టాలీవుడ్ లో కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తున్నారు. యూత్ లో సైతం వీరిద్ద‌రికీ విపరీత‌మైన‌ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ ఇద్దరు బ్యూటీలు ఒకే వేదికపై కలిసి డాన్స్ చేస్తే.. అభిమానులకు కన్నుల పండగే అవుతుంది.

అలాంటి సందర్భమే తాజాగా చోటుచేసుకుంది. రీసెంట్గా హైదరాబాద్ లో ఓ అవార్డు ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ లో కృతి శెట్టి, రష్మికలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఫంక్షన్ లో రష్మిక, కృతి శెట్టి కలిసి పుష్ప సినిమాలోని సూప‌ర్ మిట్ సాంగ్ `రారా సామి.. బంగారు సామి`కు మాస్ స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టారు.

rashmika mandanna krithi shetty
rashmika mandanna krithi shetty

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు రష్మిక అభిమానులు, ఇటు కృతి శెట్టి అభిమానులు ఈ వీడియోను చూసి తెగ మురిసిపోతున్నారు. కాగా, కెరీర్ విషయానికి వస్తే కృతి శెట్టి ప్రస్తుతం నాగచైతన్యకు జోడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది.

అలాగే మలయాళ, తమిళ భాషల్లోనూ పలు ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఇక‌ రష్మిక విషయానికి వస్తే.. ఈ అమ్మడు తెలుగులో `పుష్ప 2`, తమిళంలో `వారసుడు` చిత్రాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`, `యానిమల్` తదితర చిత్రాల్లో భాగమైంది.

https://youtu.be/-_zZm7FBrhE


Share

Related posts

పూజా హెగ్డే వల్ల టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ దక్కించుకున్న రష్మిక ..?

GRK

Anjali Latest Pictures

Gallery Desk

KGF 2 – RRR: కేజీఎఫ్ 2 హడావిడి మొదలు ఇక ఆర్ఆర్ఆర్‌కు గట్టి దెబ్బేనా..?

GRK