నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలనీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్, ప్రమోషన్స్ తో బిజీగా గడిపిని ఈమె.. రీసెంట్‌గా చిన్న బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేసింది.
అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి.. మళ్లీ నేడు ఇండియాకు రిటర్న్ అయింది. ఇందులో భాగంగానే ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. అయితే ఆమె మాల్దీవ్స్ నుంచి తిరిగి వస్తూ ముంబై ఎయిర్ పోర్ట్‌లో ముఖాన్ని చూపించలేక మాస్క్ తో కవర్ చేసుకుంది. మీడియా ప్రతినిధులు మాస్క్ తీయమని ఎంత రిక్వెస్ట్ చేసినా.. అందుకు రష్మిక ఒప్పుకోలేదు.

`ముఖం ఫుల్ టాన్ అయిపోయింది.. అందుకే ముఖం ఇప్పుడు చూపించలేను.. ఏమీ అనుకోవద్దు` అంటూ రష్మిక కారణాన్ని కూడా వెల్లడించింది. ఇక కొందరు అభిమానులు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చినా సరే రష్మిక మాత్రం మాస్క్ ను తొలగించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన `పుష్ప 2`, తమిళంలో విజయ్ దళపతికి జోడిగా `వారసుడు` చిత్రాలతో పాటు బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`, `యానిమల్` ప్రాజెక్ట్స్ లో భాగం అయింది. వీటితో పాటు మరిన్ని చిత్రాలకు సైతం రష్మిక సైన్ చేసింది.