Rashmika: ఇలాంటి రూమర్స్‌ ఎలా సృష్టిస్తారు.. న‌వ్వు ఆపుకోలేక‌పోతున్న ర‌ష్మిక‌!

Share

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌న్నడ మూవీతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. `ఛ‌లో` వంటి హిట్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి కాలంలోనే ఇక్క‌డ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ కెరీర్ ప‌రంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

ఇక‌పోతే తాజాగా ర‌ష్మికపై ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అయింది. అదేంటంటే.. రీసెంట్‌గా షూటింగ్ నిమ్మితం హైదరాబాద్‌ నుంచి మరో ప్రాంతానికి రష్మిక పయణించాల్సి ఉండగా.. తనతో పాటు తన పెంపుడు కుక్క కూడా ప్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేయాలని డిమాండ్ చేసి నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెట్టింద‌ట‌.

ఈ వార్తే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుండ‌గా.. దీనిపై ర‌ష్మిక ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. `హే.. ఇలాంటి రూమర్స్‌ ఎలా సృష్టిస్తారలో అర్థం కావ‌డం లేదు. ఆరా(రష్మిక పెట్ డాగ్‌) నాతో కలిసి పయణించాలని మీకు ఉన్న. త‌న‌కు మాత్రం నాతో ట్రావెల్‌ చేయడం అసలు ఇష్టం ఉండదు. తను హైదరాబాద్‌లోనే హ్యాపీగా ఉంటుంది` అంటూ ట్విట్ చేసింది.

వెంట‌నే మ‌రో ట్విట్‌లో `క్షమించండి నవ్వు ఆపుకోలేకపోతున్నా` అని పేర్కొంది. దీంతో నెట్టింట ట్రెండ్ అవుతున్న వార్త రూమ‌రే అని తెలిపోయాయి. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప 2`, విజ‌య్ ద‌ళ‌ప‌తికి జోడీగా `వార‌సుడు` చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న `సీతా రామం`లో ఓ కీల‌క పాత్ర‌ను ర‌ష్మిక పోషిస్తోంది. మ‌రోవైపు హిందీలో `మిష‌న్ మ‌జ్ను`, `గుడ్ బై`, `యానిమ‌ల్‌` చిత్రాలు చేస్తోంది.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

8 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

59 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago