నేషనల్ క్రష్ రష్మిక హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోంది. గత కొంత కాలం నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆమె తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డిని కలిసి చికిత్స తీసుకుంటోంది. ఈ విషయాన్ని గురువారెడ్డి స్వయంగా వెల్లడించారు.
ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు. “నువ్వు సామి..సామి.. అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి! అని` మోకాలి నొప్పి అంటూ నా దెగ్గరకు వచ్చిన శ్రీవల్లికి సరదాగా పెదవి విరుస్తూ అన్నాను.
పుష్ప సినిమా చుసిన మొదలు, రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది! బన్నీ కూడా త్వరలో భుజం నొప్పి తో వస్తాడేమో..“ అంటూ గురువారెడ్డి తన ఫేస్ బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే రష్మిక తో దిగిన ఓ ఫోటోను సైతం ఆయన షేర్ చేశారు.
దీంతో ఆయన పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన `పుష్ప 2` మూవీలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్‌లో దళపతి విజయ్ కు జోడిగా `వారసుడు` అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`, `యానిమల్` తదితర చిత్రాలకు సైన్ చేసింది.