కన్నడ సోయగం, నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఇందులో భాగంగానే వరుస బాలీవుడ్ చిత్రాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు ముంబైలో సందడి చేసింది. బాలీవుడ్ సినీ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఆఫీస్ బయట కనిపించింది. దాంతో అక్కడ ఉన్న కొందరు కెమెరా మ్యాన్స్ ఆమె పిక్స్‌ను క్లిక్కుమనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో రష్మిక ధరించి డ్రెస్ ధర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బ్లాక్ అండ్ వైట్ అవుట్ పీట్‌ను రష్మిక ధరించింది. అయితే ఈ డ్రెస్ ఎంతో సింపుల్ గా ఉన్నా.. ఖరీదు మాత్రం షాకిస్తోంది. ఇంతకీ ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 1, 26, 440. దీంతో ఇంత సింపుల్ డ్రెస్ అంత ధరా అంటూ నెటిజన్లు ఎప్పటిలాగనే నోరెళ్లబెడుతున్నారు.
కాగా, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈ బ్యూటీ అల్లు అర్జున్‌కు జోడీగా `పుష్ప 2`లో నటించబోతోంది. తమిళంలో విజయ్ దళపతితో `వారసుడు`, బాలీవుడ్లో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`, `యానిమల్` చిత్రాలు చేస్తోంది. ఇక మలయాళంలో ఈమె నటించిన `సీతారామం` ఆగస్టు 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.