నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక.. `పుష్ప` పార్ట్ 1తో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.
అయితే తాజాగా ఈ బ్యూటీకి కోలీవుడ్ నుండి పెద్ద ఆఫర్ వచ్చిందట. తమిళ సీనియర్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల తన 61వ చిత్రాన్ని `కాలా`, `కబాలి` ఫేమ్ పా. రంజిత్ తోఅనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఈ. జ్ఞానవేల్ రాజా హై బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఆ డ్రెస్ ఏంటి రష్మికా..? ఈ పిక్స్ చూస్తే మీరు అదే అంటారు!
పూజా కార్యక్రమాలతో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుందట. అయితే ఈ చిత్రంలో విక్రమ్ కు జోడీగా నటించాలని రష్మికను మేకర్స్ సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్‌ను సైతం ఆఫర్ చేశారట. అయితే రష్మిక ఒప్పుకుందా..? లేదా..? అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇది పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ.. రష్మిక నో చెప్పడమే మంచిదని పలువురు అభిమానులు, నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.
అందుకు కారణం లేకపోలేదు. విక్రమ్, రష్మికల మధ్య దాదాపు ముప్పై ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది. వీరిద్దరి మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ అంటే స్క్రీన్‌పై కాస్త వెగుటుగానే ఉంటుంది. అది సినిమాకు మరియు రష్మిక కెరీర్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక.. ఈ టైమ్‌లో విక్రమ్ వంటి సీనియర్ స్టార్‌తో జతకట్టడం అవసరమా..? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి విక్రమ్ మూవీ విషయంలో రష్మిక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!