Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో గ్రాండ్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ సోయగం.. అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ హోదను దక్కించుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అలాగే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల లిస్ట్‌లో తన పేరును చేర్చుకుంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తరచూ ఫొటో షూట్లు, చిట్ చాట్లతో అభిమానులను పెంచుకుంటూ పోతోంది. ఇక తాజాగా ఓ అభిమాని కోసం తన సెక్యూరిటీ గార్డ్ పైనే ఫైర్ అయింది. అసలేం జరిగిందంటే.. తాజాగా రష్మిక షూటింగ్ ముగించుకుని క్యార వ్యాన్ లోకి వెళుతున్న సమయంలో అభిమానులు, మీడియా వారు చుట్టుముట్టారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో రష్మిక మొదట మీడియాకు ఫోజులిచ్చి.. ఆపై ఫ్యాన్స్ సెల్ఫీలు దిగింది. ఇక అన్ని ముగించుకుని క్యార వ్యాన్ లోకి వెళుతుండగా ఓ అభిమాని పరిగెత్తుకుంటూ రష్మిక వద్దకు సెల్ఫీ కోసం వచ్చాడు. ఇంతలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ సదరు అభిమానిని పక్కకు నెట్టేసి ప్రయత్నం చేశారు.
కానీ, వెంటనే రష్మిక సదరు సెక్యూరిటీ గార్డ్‌పై చిరు కోపం వ్యక్తం చేస్తూ అభిమానని విడిచిపెట్టమని చెప్పి.. అతడితో సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. రష్మిక వ్యక్తితత్వానికి నెటిజన్లు ఫిదా అవుతూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో `పుష్ప 2`, తమిళంలో `దళపతి 66`, మలయాళంలో `సీతా రామం` చిత్రాలు చేస్తోంది. ఇక హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ చిత్రాలకు సైన్ చేసింది.
https://www.instagram.com/reel/CewOe_AAMmo/?utm_source=ig_web_copy_link