నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్లో మూడు చిత్రాలు చేస్తున్న రష్మిక.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ను పట్టేసింది.
ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `ఆషికీ 3` రష్మిక హీరోయిన్గా ఎంపిక అయింది. బాలీవుడ్ లో `ఆషికీ` సీక్వెల్స్ కు ఎంత మంచి ఆదరణ ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. 1990లో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించిన `ఆషికీ` అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ మూవీకి కొనసాగింపుగా 2013లో `ఆషికీ 2` వచ్చింది. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. ఈ సినిమా సైతం మంచి విజయం సాధించింది. ఇప్పుడు `ఆషికీ 3` రాబోతోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఆర్యన్‌కు జోడీగా రష్మికను ఎంపిక చేశారట.
ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని.. రష్మికకు కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రచారం జరుగుతోంది. దీంతో లక్ అంటే రష్మికదే అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో రష్మిక నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకోవడమే అందుకు కారణం.
https://www.instagram.com/p/CimRESyJWmb/?utm_source=ig_web_copy_link