నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన లైఫ్‌లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించింది. అయితే ఆ వ్యక్తి మనిషి కాదులేండి.. పిల్లి. రష్మికకు పెట్స్ అంతే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆరా అనే పెట్ డాగ్‌ను పెంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇంటికి ఓ పిల్లిని తెచ్చుకుంది.
దానికి `స్నో` అని నామకరణం చేసి అందరికీ పరిచయం కూడా చేసింది. ఆరా, స్నోలతో కలిసి చేసిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన రష్మిక.. `ఇది నా కొత్త పెట్ స్నో. ఇంకో 3 సంవత్సరాల్లో నా ఇల్లు చిన్నపాటి అడవిగా మారుతుందేమో` అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది.
న్యూస్ రిపోర్టర్ గా మారబోతన్న రష్మిక.. మరి సినిమాల సంగతేంటి?
దీంతో ఆమె పోస్ట్ చేసిన వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. మొత్తానికి స్నో మాత్రం చాలా ముద్దుగా కనిపిస్తోంది. కాగా, రష్మిక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో `పుష్ప 2` సినిమా చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
అలాగే తమిళంలో విజయ్ దళపతి సరసన `వరిసు(తెలుగులో వారసుడు)`, మలయాళంలో `సీతా రామం` చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా `మిషన్ మజ్ను`, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో `గుడ్ బై`, రణబీర్ కపూర్ సరసన `యానిమల్` చిత్రాల్లోనూ నటిస్తోంది.
https://www.instagram.com/reel/Cf6XjEqq288/?utm_source=ig_web_copy_link
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!