Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయి ఆల్రెడీ ఒక వారం గడిచిపోయింది. ఈ క్రమంలో హౌస్ నుండి మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కావటం జరిగింది. హౌస్ లో పెద్దగా టాస్కులలో పాల్గొనక పోవటంతో పాటు నీరసంగా గేమ్ ఉండటంతో.. మొదటివారం నామినేషన్ లో ఉన్న కిరణ్ రాథోర్.. తక్కువ ఓట్లు రాబట్టడంతో ఎలిమినేట్ అయిపోయింది. మొత్తం 14 మంది సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం 13 మందే ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సీజన్ సెవెన్ లో ఓ జంట.. బయట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వాళ్లెవరో కాదు రతిక.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఇద్దరు హౌస లో వ్యవహరిస్తున్న తీరు పట్ల.. బయట నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ప్రతి కెమెరా వద్ద సింపతి గేమ్ ఆడుతూ డైలాగులు వేయడంతో భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
కిందపడిన అన్నం తినడంతోపాటు… రకరకాలుగా బిగ్ బాస్ నీ మెప్పించే రీతిలో వ్యవహరించడం చూస్తున్న జనాలకు చిరాకు పుట్టిస్తూ ఉంది. యూట్యూబ్ గా ప్రారంభంలో.. భారీ ఎత్తున ఓట్లు రాబట్టిన ప్రశాంత్ మొదటి వారం మాట తీరుతో ప్రస్తుతం ఆయన పట్ల బయట విపరీతమైన నెగిటివ్ ఏర్పడింది. ఇదే సమయంలో లేడీ కంటస్టెంట్ రతిక.. ప్రశాంత్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంది. హౌస్ లో అందరు పడుకున్న సమయంలో ఇద్దరు సపరేట్ గా మాట్లాడుకోవడంతోపాటు… ఉదయం ఎవరూ నిద్ర మేలుకొనక ముందే.. మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కూడా బాగా కనెక్ట్ అయిపోతూ ఉన్నాడు. రతికతో వేరే కంటెస్టెంట్ ఎవరైనా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటే చూడలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే రతిక మాజీ బాయ్ ఫ్రెండ్… రాహుల్ సిప్లిగంజ్.. షోలో ప్రశాంత్ వేస్తున్న వేషాలకి ఇటీవల షో చూసి టీవీ రిమోట్ కూడా పగలగొట్టడం జరిగింది అంట. ఇటీవల రతికకి సంబంధించి మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే.
దీంతో ఈ విషయం తెలుసుకున్న రాహుల్.. సీజన్ సెవెన్ షో చూడటం జరిగిందట. ఈ క్రమంలో వీరిద్దరి వేషాలు చూసి ఒక్కసారిగా టీవీ రిమోట్ బద్దలు కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ సీజన్ 3 విజేత అని అందరికీ తెలుసు. ఆ సమయంలో పునర్నవితో కలిసి ఉండటంతో… రతిక.. జీర్ణించుకోలేక రాహుల్ కి గుడ్ బాయ్ చెప్పడం జరిగిందట. ఈ వార్త కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ప్రైవేట్ సాంగ్ చేస్తున్న టైంలో రతికతో రిలేషన్ లో ఉన్నట్లు ఫోటోలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో వేరే అమ్మాయితో రాహుల్ క్లోజ్ అవ్వటం కారణంగానే.. రతిక… లవ్ బ్రేకప్ అయిందానీ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హౌస్ లో రతిక.. ప్రశాంతత క్లోజ్ గా ఉండటం పట్ల రాహుల్ షో చూసి టీవీ రిమోట్ పగలగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.