మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో 154వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇటీవలే సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం మాత్రమే కాదు వేట స్టార్ట్ చేస్తున్నట్లు సంక్రాంతికి వస్తున్నట్లు క్లారిటీ ఇచేయడం జరిగింది. అయితే సినిమాలో ప్రారంభంలోనే రవితేజ కూడా చిరంజీవితో పాటు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇటీవల రవితేజ షెడ్యూల్ బిజీగా ఉండటంతో చిరంజీవి సినిమా నుండి తప్పుకున్నట్లు టాక్ వచ్చింది.
అయితే తాజాగా మాత్రం ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం… చిరంజీవి సినిమాలో రవితేజ తప్పుకోలేదంట. అంత మాత్రమే కాదు దాదాపు 40 రోజులపాటు కాల్ షీట్స్ ఈ ప్రాజెక్టుకి రవితేజ కేటాయించడం జరిగిందట. సినిమాలో రవితేజ ఫ్యామిలీ మెన్ గా కనిపించనున్నారట. ఒక బాబుకి తండ్రిగా కేథరిన్ థెరిస్సా కి భర్తగా నటించ నున్నారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ లో రవితేజ జాయిన్ కానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” మరికొన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు. గతంలో రవితేజ చిరంజీవితో అన్నయ్య, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలలో నటించడం జరిగింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత చిరంజీవితో రవితేజ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులకు మరింత ఇంట్రెస్ట్ నెలకొంది. ఇక చిరంజీవి కూడా ఒకపక్క “గాడ్ ఫాదర్” కి ఫినిషింగ్ ఇస్తున్నే మరో పక్క “బోలో శంకర్” సినిమా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల బాబి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!