మాస్ మహారాజ్ రవితేజ త్వరలోనే `రామారావు ఆన్ డ్యూటీ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఇందులో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తే.. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలను పోషించారు. రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిపై పోరాడే ఓ ప్రభుత్వ ఉద్యోగి కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 29వ తేదీన థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది.
ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం హైదరాబాద్ – ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. న్యాచురల్ నాని స్పెషల్ గెస్ట్ గా వచ్చి ఈ ఈవెంట్‌ను సక్సెస్ ఫుల్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో రవితేజ డ్యాన్స్ చేశారు. అది కూడా 20 ఏళ్ల నాటి పాటకు. అవును, 2002లో పూరీ జగన్నాథ్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ `ఇడియట్` మూవీలోని `చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్` సాంగ్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఇదే సాంగ్‌కు `రామారావు ఆన్ డ్యూ` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో యాంకర్ సుమ అడగడంతో.. రవితేజ కాదనకుండా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఇరవై ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీతో డ్యాన్స్ చేశారో.. ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో రవితేజ డ్యాన్స్ చేశాడని, ఆయనలో ఆ మాస్ ఎనర్జీ అస్సలు తగ్గలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Song vachi 20 yrs ina craze em matram thaggaledhu 🔥🔥🥳🥳
Mass energy ❤️🔥💫⚡⚡⚡🥵🥵🤙@RaviTeja_offl#RamaRaoOnDuty pic.twitter.com/jkGaiLbR3Z
— HÁRẞHÆ- on duty July 29th 🎭 (@Harsha_offll) July 25, 2022