Entertainment News సినిమా

అవ‌న్నీ పుకార్లే.. మెగాస్టార్ కోసం ర‌వితేజ దిగిపోయాడోచ్‌?!

Share

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `మెగా 154` ఒక‌టి. యంగ్ డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం అవుతోంది. వైజాగ్ జాల‌రీపేట బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర‌య్య` అనే టైటిల్ దాదాపు క‌న్ఫార్మ్ అయిపోయింది. ఇక‌పోతే ఈ సినిమాలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌ధ్య‌లో ఆయ‌న ఈ సినిమా నుండి త‌ప్పుకున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇత‌ర ప్రాజెక్ట్‌ల కార‌ణంగా ర‌వితేజ `మెగా 154` నుండి త‌ప్పుకున్నార‌ని, ఆయ‌న స్థానంలో మ‌రో హీరోను తీసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అవ‌న్నీ పుకార్లే అట‌. లేటెస్ట్ స‌మాచారం ప్రకారం.. మెగాస్టార్ కోసం ర‌వితేజ దిగిపోయార‌ట‌. ప్ర‌స్తుతం `మెగా 154` షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌రవేగంగా జ‌రుగుతోంది.

అయితే గురువారం ర‌వితేజ చిరంజీవితో క‌లిసి షూటింగ్‌లో జాయిన్ అయ్యార‌ట‌. నేటి నుండి ప‌ది రోజుల పాటు చిరంజీవి, ర‌వితేజ‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, చిరంజీవి ఈ సినిమాలో మత్స్యకారునిగా నటిస్తున్నారు. ఆయ‌న త‌మ్ముడిగా రవితేజ క‌నిపించ‌నున్నాడ‌ని, ఆయ‌న‌కు జోడీగా కేథరిన్ థెరిస్సా అల‌రించ‌బోతోంద‌ని తెలుస్తోంది.


Share

Related posts

Bheemla Nayak: అందుకే నిత్యా మీనన్ భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానన్నారు..సీక్రెట్ రివీల్..?

GRK

Nivisha New HD Gallerys

Gallery Desk

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన హనీ.. తులసిని పాపకు దూరంగా ఉండమన్న సామ్రాట్..!

bharani jella