25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
Entertainment News సినిమా

`ధ‌మాకా` మాస్ క్రాక‌ర్‌.. దీపావ‌ళికి ర‌వితేజ‌ స‌ర్‌ప్రైజ్ అదిరింది!

Share

మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ర‌వితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా నుంచి మూడు రోజుల ముందే అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చింది. ఆ స‌ర్‌ప్రైజ్ మ‌రేంటో కాదు ధ‌మాకా టీజ‌ర్‌. మాస్ క్రాక‌ర్ పేరుతో మేక‌ర్స్ తాజాగా ధ‌మాకా టీజ‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

dhamaka movie teaser
dhamaka movie teaser

`నేను మీలో విలన్ ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు.. కానీ నేను యాక్షన్ లో ఉన్నప్పుడు శాడిస్ట్ ని` అంటూ ర‌వితేజ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో ఓ కంపెనీకి సీఈవోగా, మరోవైపు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా ర‌వితేజ క‌నిపించబోతున్నాడు.

డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ లో ఎప్పటిలాగే ఫుల్ ఎనర్జీతో ర‌వితేజ మెప్పించ‌డం ఖాయ‌మ‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇక `అట్నుంచీ ఒక బుల్లెట్ వస్తే.. ఇట్నుంచి దీపావళే..` అంటూ చివ‌ర్లో ర‌వితేజ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి అదిరిపోయిన టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. వ‌చ్చే నెల నుంచి ప్ర‌మోష‌న్స్ సైతం షురూ కానున్నాయి.

 


Share

Related posts

Samantha : సమంత జీవితాన్ని మార్చేయబోతున్న ఆ ఇద్దరు..?

Ram

sreemukhi Latest Pics

Gallery Desk

SVP: మహాశివరాత్రి సందర్భంగా “సర్కారు వారి పాట” కొత్త పోస్టర్ లుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

sekhar