20.7 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

కృష్ణంరాజు ఆస్తుల లెక్క తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది.. ఎన్ని కోట్లో తెలుసా?

Share

రెబ‌ల్ స్టార్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్టంరాజు నేడు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయ‌న.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త కుటుంబ సభ్యులను, సినీ ప్ర‌ముఖ‌ల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను, అభిమానుల‌ను మ‌రియు సన్నిహితులను శోకసంద్రంలోకి నెట్టేసింది.

సోమ‌వారం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇక‌పోతే సినీ ఇండ‌స్ట్రీలో కృష్ణంరాజు దాదారు అర‌వై ఏళ్ల పాటు కెరీర్ ను కొన‌సాగించారు. అయితే ఆయ‌న కేవ‌లం సినీ ఇండ‌స్ట్రీకే ప‌రిమితం కాలేదు. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న సేవ‌లందించారు.

krishnam raju assets
krishnam raju assets

ఈ క్ర‌మంలోనే ఎన్నో ఆస్తుల‌ను సంపాదించారు. ఆయ‌న ఆస్తుల లెక్క తెలిస్తే ఎవ్వ‌రికైనా దిమ్మ‌తిర‌గాల్సిందే. ప్రస్తుతం కృష్ణంరాజు ఫ్యామిలీతొ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఆయ‌న ఉంటున్న‌ ఇంటి ఖరీదు రూ. 18 కోట్ల వరకు ఉంటుందట‌. అలాగే చెన్నై , హైదరాబాద్ వంటి మహానగరాలలో మొత్తం నాలుగు ఖరీదైన ఇళ్ళు ఉన్నాయి.

రూ. 20 నుంచి 30 కోట్లు విలువ‌ల చేసే కార్లు, ఇత‌ర వాహ‌నాలు కృష్ణంరాజుకు ఉన్నాయ‌ని అంటున్నారు. కృష్ణంరాజుకి వారసత్వంగా మొగల్తూరులో కొన్ని వందల ఎకరాల భూమి వచ్చినట్లు తెలుస్తోంది. మొగల్తూరులో ఒక పెద్ద భవనం కూడా ఆయ‌న ఉందట. ఇక మొత్తంగా కృష్ణంరాజు ఆస్తుల‌ విలువ‌ రూ. 800 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


Share

Related posts

Tollywood: మరో సెన్సేషనల్ లెజెండ్ బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్న టాలీవుడ్..??

sekhar

బిగ్ బాస్ 4 : తెలీకుండానే పెద్ద తప్పు చేసిన సోహెల్… ఆమెకు ఛాన్స్ ఇచ్చేశాడే….

arun kanna

Karthi: డైరెక్టర్‌గా హీరో కార్తీ ఎంట్రీ.. అన్నయ్యతోనే తొలి మూవీ!

Ram