రెజీనా కాసాండ్రా.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `శివ మనసులో శృతి` మూవీతో సినీ కెరీర్ను ప్రారంభించిన రెజీనా.. కొత్త జంట, పిల్ల నువ్వు లెని జీవితం మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసిన ఈ భామ స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా క్రేజీ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో పాటు పాలు వెబ్ సిరీస్లు చేస్తోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే.. రెజీనా రీసెంట్గా ప్రముఖ పాపులర్ షో `అలీతో సరదాగా`లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు మహా ఇష్టమని చెప్పుకొచ్చింది.
అర్థరాత్రి దాని కోసం ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పా: రెజీనా
అయితే ఆల్ టైం ఫేవరెట్ హీరో మాత్రం రజనీకాంత్ అంటూ ఆమె పేర్కొంది. అంతేకాదు, దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో నటించాలనుందంటూ ఓ పెద్ద కోరికను కూడా ఆమె బయట పెట్టింది. రాజమౌళి తీసే సినిమాలలో నటనకు ఆస్కారం ఉంటుందని, అందుకే ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.
కాగా, రెజీనా ఇటీవలె ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే వెబ్ సీరిస్ తో ప్రేక్షకులను పలకరించింది. ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈమె `నేనేనా`, `శాకినీ ఢాకినీ` అనే సినిమాలు చేస్తోంది. అలాగే అనుపమ పరమేశ్వరన్ తో కలిసి `మరీచిక` అనే వెబ్ సిరీస్ చేస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!