రేణు దేశాయ్.. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో జన్మించిన రేణు.. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రేణు దేశాయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `బద్రి` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన రేణు దేశాయ్.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. తన తొలి సినిమా హీరో అయినా పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడడం, అతడితో సహజీవనం చేసి పిల్లలను కనడం, ఆపై పెళ్లి చేసుకోవడం, విడిపోవడం వంటి అంశాలు రేణు దేశాయ్ సినీ కెరీర్‌ను నాశనం చేశాయి.

ఆ సంగతులు పక్కన పెడితే.. మళ్లీ 18 ఏళ్లకు రేణు దేశాయ్ రీఎంట్రీకి సిద్ధమైంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న `టైగర్ నాగేశ్వరరావు` సినిమాతో రేణు మళ్ళీ తెరపై మెరవబోతోంది. వంశీ కృష్ణనాయుడు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
1970లో స్టూవర్టుపురంలోని టైగర్ నాగేశ్వర్‌రావు అనే ఒక దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రేణుదేశాయ్ `హేమలతా లవణం` అనే ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈమె ప్రీ లుక్ ను ఒక వీడియో క్లిప్ ద్వారా బయటకు వదిలారు. ఆకట్టుకుంటున్న రేణు ప్రీ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.