RGV: రాంగోపాల్ వర్మ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ రేవంత్ రెడ్డి..!!

Share

RGV: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏది తీసిన సంచలనమే. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా ఆర్జివి పేరు ఎలక్ట్రానిక్ అదేవిధంగా సోషల్ మీడియాలో మారుమోగుతూ ఉంటుంది. సమాజంలో సున్నితమైన అంశాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ తాజాగా తెలంగాణ రాజకీయ నేతలు కొండా దంపతుల జీవిత కథతో.. “కొండా” అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23వ తారీకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో “కొండా” సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18వ తారీకు వరంగల్ లో ప్లాన్ చేయడం జరిగింది.

ఖుష్ మహల్ గ్రౌండ్ లో 18న సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. స్వయంగా ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తున్న తన మిత్రుడు, తెలంగాణ సింహం రేవంత్ రెడ్డికి ‘కొండా’ సినిమా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాంగోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయోపిక్ కూడా చేసే ఆలోచన ఉన్నట్లు గతంలో ఆర్జీవి కామెంట్లు చేయడం జరిగింది. రాజకీయంగా వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ టైం లో కెసిఆర్ బయోపిక్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా సరిగ్గా ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ కొండా దంపతుల బయోపిక్ తెరకెక్కించడం అటు రాజకీయంగా ఇటూ సినిమాపరంగా సంచలనంగా మారింది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

53 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago