RGV: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడు ఏదోక వివాదాస్పద సినిమా లేదా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తలు ఉంటూనే ఉంటాడు. ఎప్పుడే ఏదోక సినిమా చేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు ఆర్జీవీ సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ గత కొద్ది సంవత్సరాలు ఆర్జీవీ సినిమాల మీద ఆసక్తి బాగా తగ్గిపోయింది. ఆయన సినిమాలను ఎవరూ చూడటం లేదు. అసలు ఆయన సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియడం లేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం కొండా సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. డేంజరస్ తో పాటు మరో రెండు, మూడు సినిమాలు చేస్తున్నాడు. వచ్చే వారంలో కొండా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు చానళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆర్జీవీ సంచలన విషయం బయటపెట్టాడు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కు మాత్రమే ఆర్జీవీ పరిమితమయ్యాడు. టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడులో బాలీవుడ్ లో సినిమాలు తీసిన ఆర్జీవీ.. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీని వదిలేశాడు.
అయితే తాజాగా కొండా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ సంచలన విషయం బయటపెట్టాడు. త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలిపాడు. బాలీవుడ్ లో భారీ సినిమా చేయబోతున్నానని స్పష్టం చేశాడు. ఆ సినిమా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో అని వర్మ ప్రకటించాడు. అమితాబ్ తో ఓ హర్రర్ సినిమా చేయబోతున్నానని, ఇప్పటికే తనకు అమితాబ్ డేట్లు కూడా ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేశాడు. నవంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు వర్మ పేర్కొన్నాడు.
వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. గతంలో వర్మ-అమితాబ్ కాంబోలో హిందీలో సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.