NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

RK Roja: ఆర్కే రోజా.. సినిమా పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగు తో పాటు కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించింది. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. వివాహం అనంతరం హీరోయిన్ గా క్రేజ్ త‌గ్గ‌డంతో పలు సినిమాల్లో సహాయక పాత్రలను పోషించింది. బుల్లితెరపై హోస్ట్ గానూ సక్సెస్ అయ్యింది. 2004లో‌ రోజా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తెలుగుదేశం పార్టీ తరఫున నగరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది. 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేయగా.. ఆ ఎన్నిక‌ల్లో సైతం పరాజయాన్ని మూట కట్టుకుంది.

ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన రోజా.. 2014 మ‌రియు 2019 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక సినిమాలకు దూరమైనప్పటికీ.. రోజా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు నాగబాబుతో కలిసి జడ్జ్ గా చాలా ఏళ్లు ప‌ని చేశారు. ఈ కామెడీ షో బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయింది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే జగన్ మోహన్ రెడ్డి హయాంలో మంత్రి పదవి ద‌క్కిన అనంత‌రం రోజా.. జబర్దస్త్ షోను వీడడమే కాకుండా బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యారు.

ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే తాజా ఎన్నికల్లో రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ తరఫున నగరి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఈసారి ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయింది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం దుందుభీ మోగించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్‌ చేసేసారు. కూటమి జోరుకు వైసీపీ బేజార్ అయిపోయింది. చివరకు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు.

నగరిలో టీడీపీ అభ్యర్థిగాలి భానుప్రకాశ్‌ 40 వేలు పైచీలుకు ఓట్ల మెజారిటీతో ఆర్కే రోజాను ఓడించారు. దీంతో రోజా రూటు మళ్లీ జబర్దస్త్ వైపే అంటూ ప్రచారం మొదలైంది. ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఆమె తిరిగి జబర్దస్త్ షోకు జడ్జ్ గా వస్తారని వార్తలు వస్తున్నాయి. మ‌రోవైపు న‌టుడు నిర్మాత బండ్ల గ‌ణేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా రోజా ప‌రాజ‌యంపై సెటైరిక‌ల్ పోస్ట్ పెట్టారు. `జబర్దస్త్‌ పిలుస్తోంది రా.. కదలిరా.. రోజా` అంటూ ఆమె ఫోటోను పెట్టి ట్విట్ చేశారు.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju