Rocky Aur Rani Ki Prem Kahani: కరన్ జోహార్ ఏడు సంవత్సరాల తర్వాత దర్శకత్వం వహించిన సినిమా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ. అందువలన దీనిమీద బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తారాగణం చాలా భారీ గా ఉంది. రణ్వీర్ సింగ్ , ఆలియాభట్ నాయకా నాయికలు ఇంకా ధర్మేంద్ర, జయబచ్చన్, షాబానా ఆజ్మీ , వరుణ్ ధావన్, అనన్య పాండే, సారా ఆలీ ఖాన్, జాన్వీ కపూర్ . అందరూ హేమాహేమీ లే ఇంక కధ లోకి వెళ్తే ఢిల్లీలో ఒక పెద్ద మిఠాయి కంపెనీని నడిపే పంజాబీ కుటుంబానికి వారసుడు రాకీ రాంధ్వా (రణ్‌వీర్ సింగ్). అందమైన చూపులతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే రాకీకి ధనలక్ష్మీ ( జయ బచ్చన్), కన్వల్ (ధర్మేంద్ర) అనే తాత, అమ్మమ్మలు ఉంటారు. న రాకీ తాత కు బాగా నచ్చిన జమిని ఛటర్జీ (షబానా ఆజ్మీ)ని కలిసేందుకు వెళ్తాడు. అప్పుడు జమినీ ఛటర్జీ మనవరాలు రాణి ఛటర్జీ (ఆలియాభట్) ని చూసిన వెంటనే ప్రేమలో పడుతాడు. అయితే వీళ్ళ ప్రేమకు రెండు కుటుంబాలు అభ్యంతరం చెబుతాయి.

బెంగాలీకి చెందిన రాణి పాత్రికేయురాలిగా ఏం చేయాలనుకొన్నది? పక్కా పంజాబీ యువకుడైనా రాకీ తన జీవితంలో ఏమి సాధించాలను కుంటాడు ? ఈ కథకు ధనలక్ష్మీ, కన్వల్, జమిని ఛటర్జీ పాత్రల కు ఉన్న సంబంధం ఏమిటి? రాణి, రాకీ ప్రేమకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి రాకీ, రాణి ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమా కథ.
దర్శకుడు కరణ్ జోహర్ పద్దతి లో సాగే కుటుంబ వాతావరణం , పాటలు, డ్యాన్సులు, ఊహకందని భావోద్వేగాలతో సరదాగా సాగుతుంది. కథలో రొటీన్‌గా ఉంటుంది. ఆఖరి సన్నివేశం వరకూ ఎం జరుగుతుం దో తేలిగ్గా ఊహించవచ్చు. చివరలో రాకీ రాణి ల పెళ్లి కి ధనలక్ష్మీ కుటుంబ ఇచ్చే చిన్న ట్విస్టు సరదాగా అనిపిస్తుంది.
స్వీట్ వ్యాపారం నిర్వహించే కుటుంబానికి చెందిన పంజాబీ యువకుడిగా రణ్‌వీర్ సింగ్ తన పాత్రలో బాగా చేసాడు. అర్బన్ యువకుడి మాదిరిగా లుక్స్ తో ఆకట్టుకొంటాడు. జర్నలిస్టుగా రాణి పాత్ర వైవిధ్యంగా ఉంది. అవినీతి నేతలను బండారం బయటపెట్టాలనుకొనే యువతి పాత్రలో ఆకట్టుకొన్నది. ఆలియా భట్ నటన చాలా పరిణితి గా బాగుంది.
ఇతర పాత్రలో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. ప్రీతమ్ సంగీతం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ష్, భజారే, తుమ్ క్యా మిలే, దోలా రే డోలా పాటలు తెరపైన క్రేజీగా ఉంటాయి. మనుష్ నందన్ సినిమాటోగ్రఫి బాగుంది. సంపన్న వర్గాల ఇంటి సెటప్‌లో సాగే ఫ్యామిలీ డ్రామాను, ప్రతీ సన్నివేశాన్ని రిచ్‌గా చిత్రీకరించారు. మోయిత్రా రాసిన డైలాగ్స్ భావగర్భితంగాను హాస్యం , కామెడీని బాగా పండించాయి. సినిమాలో ప్రతీ సన్నివేశం చాలా డబ్బు ఖ్ర్చు పెట్టినట్లు చెబుతుంది.
కభీ కుషీ కభీ ఘమ్ సినిమా తరహాలో సాగే ఫ్యామిలీ డ్రామా. ఆలియాభట్, రణ్‌వీర్ సింగ్ ల ప్రేమాయణం సినిమాకు బలం. ధర్మేంద్ర, జయబచ్చన్, షబానా ఆజ్మీ మరోసారి మంచి నటన తో ఆకట్టుకొన్నారు. కరణ్ జోహర్ సినిమాను ఇష్టపడే వారికి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ నచ్చుతుంది.