“ఆర్ఆర్ఆర్” భారతీయ చలనచిత్ర రంగంలోనే సెన్సేషనల్ సినిమా. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసిన దర్శకుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తెరాకెక్కించటం సంచలనం రేపింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి టేకింగ్ కి సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు. ఫస్ట్ టైం తారక్ మరియు చరణ్ నటించడంతో దక్షిణాది సినిమా రంగంలోనే అతిపెద్ద మల్టీ స్టార్ గా క్రేజ్ సంపాదించి ఆరీతిగానే.. విజయం సాధించడం జరిగింది.
రామరాజు పాత్రలో చరణ్, కొమరం భీం పాత్రలో తారక్ ఇద్దరు పోటీపడి మరి నటించారు. థియేటర్ నుండి కొద్ది నెలల క్రితం ఓటీటీలో విడుదలైన “ఆర్ఆర్ఆర్” అనేక సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత కొన్ని వారాలపాటు నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. కాగా ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” మరో రికార్డు నెట్ ఫ్లిక్స్ లో క్రియేట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ సినిమాగా దాదాపు పది వారాలు పాటు.. టాప్ మోస్ట్ స్థానంలో “ఆర్ఆర్ఆర్” నిలిచింది.
నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ ప్రేక్షకులు “ఆర్ఆర్ఆర్” కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో చాలామంది హాలీవుడ్ దర్శకులు మరియు టెక్నీషియన్ లు “ఆర్ఆర్ఆర్” చూసిన తర్వాత సినిమా యూనిట్ నీ పొగడ్తలతో ముంచేతడం జరిగింది. ఇప్పటికీ కూడా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు “ఆర్ఆర్ఆర్” చూశాక తమదైన శైలిలో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జులై 26వ తారీకు నుండి డిస్నీ హాట్ స్టార్ లో కూడా అన్ని భాషలలో RRR స్ట్రీమింగ్ అవుతూ ఉంది.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…