యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.
కరోనా కారణంగా అనేక వాయిదాల అనంతరం ఈ ఏడాది మార్చి 25న విడుదలయిందీ సినిమా. అయితే రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక టాలీవుడ్ హీరోలకు జపాన్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.
ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని రీసెంట్ గా జపాన్ లో విడుదల చేశారు. అక్టోబర్ 21న భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. జపాన్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రం తొలి రోజు ఏకంగా రూ. కోటి వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అంతకు ముందు ప్రభాస్ నటించిన `సాహూ`నే జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఉంది. సాహో జపాన్లో రూ. 90 లక్షలు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సాహో రికార్డును ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టింది. మరి ముందు ముందు జపాన్లో ఆర్ఆర్ఆర్ ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.