RT4GM | Ravi Teja Gopichand 4th Movie: దుబాయ్ శీను, డాన్ శీను, వెంకీ సినిమాలతో తెలుగు వారికి అద్భుతమైన హాస్యాన్ని పండించిన మాస్ మహారాజా రవితేజ. ఆయన వాల్తేరు వీరయ్య లో చక్కటి నటన తో మెగా స్టార్ తో పోటాపోటీగా నటించి అలరించి విషయం తెలిసిందే. రవితేజ ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకు పోతున్నారు . పండగకి ‘టైగర్ నాగేశ్వరరావు’తో వచ్చి మంచి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన తన తదుపరి చేయవలసిన చిత్రాలపై దృష్టిని పెట్టారు. దర్శకుడు మలినేని గోపీచంద్ తో నాలుగోసారి సినిమాను చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.రవితేజ ‘డాన్ శీను’ సినిమాతోనే గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడిక ఈ సినిమా మొదలుపెట్టడానికి కావాల్సిన పనులు చకచకా జరుగుతున్నాయి.

సినిమా షూటింగ్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతోంది. ఇదివరలో గోపీ చందు – రవితేజ కలయిక లో ‘డాన్ శ్రీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాలు వచ్చి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు హాట్ బ్యూటీస్ హీరోయిన్స్ గా నటించబోతున్నారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ చిత్రంతో ఒక ప్రతిభావంతురాలైన అందాల యువ నటి ఇందూజ రవిచంద్రన్ తెలుగు పరిశ్రమకు పరిచయ మవుతోంది. విజయ్ ‘బిజిల్’, ధనుష్ ‘నేనే వస్తున్నా’ లాంటి సినిమా ల్లో నటించిన ఇందూజ ఈ రవితేజ – గోపీచంద్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందని నిర్మాతలు ప్రకటించారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. యువ హృదయాల క్రష్ మిక రష్మిక మందన్న కావచ్చు అని అంటున్నారు. దీని గురించి ఏమీ ప్రకటన లేదు.
Bhagavanth Kesari: ఓవర్సీస్ లో కొత్త రికార్డు సృష్టించిన బాలకృష్ణ “భగవంత్ కేసరి”..!!
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే స్తే.. జీకే విష్ణు – సినిమాటోగ్రఫీ, థమన్ – సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వారాఘవన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయన బీస్ట్, ఫర్హానా, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాలతో అలరించారు. విభిన్న పాత్రలతో అదరగొడుతున్న దర్శకుడు.. ఇప్పుడు తెలుగులో తొలిసినిమా చేస్తున్నారు. నటుడిగా ఆడియెన్స్ ను అలరించబోతున్నారు. ‘7/జీ బృందావనం కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. నవీన్ యెర్నెనీ, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. ‘వీర సింహా రెడ్డి’ విజయం తర్వాత ఆ సంస్థలో గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది. ఇక రవితేజ ‘ఈగల్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.