టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కలిసి నటించిన తాజా చిత్రం `శాకిని డాకిని`. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించారు.
కొరియన్ సినిమా `మిడ్ నైట్ రన్నర్స్`కు ఇది రీమేక్. సెప్టెంబర్ 16న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను బయటకు వదిలారు. `అకాడమీలో ట్రైనింగ్ స్ట్రిక్ట్‌గా ఉంటుందని, చాలా టఫ్‌గా ఉంటుందని మీరందరూ వినే ఉంటారు. అది వంద శాతం కరెక్టు` అనే డైలాగ్ తో ప్రారంభమైన టీజర్.. ఆధ్యంతం ఆకట్టుకుంది.
రెజీనా, నివేదా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునే అమ్మాయిలుగా కనిపించారు. అయితే రెజీనా పరిశుభ్రతకు ప్రాణమిచ్చే అమ్మాయి పాత్రలో నటిస్తే.. నివేదా ఫుడ్ ను విపరీతంగా ఇష్టపడే అమ్మాయి రోల్‌ను పోషించిందని టీజర్ బట్టీ అర్థం అవుతోంది. ఈ ఇద్దరికి ఒకరికొకరంటే పడనట్టు టీజర్ లో చూపించారు.
ఆ తర్వాత క్రైమ్ సీన్, కిడ్నాప్స్, నివేదా-రెజీనా యాక్షన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నివేదా-రెజీనాలిద్దరూ తమదైన పర్ఫామెన్స్తో అదరగొట్టేశారు. మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే.. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలానే కనిపిస్తోంది.